Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి, సాహితీ స్రవంతి సంతాపం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా సాహితీ దిగ్గజం ప్రసిద్ధ తెలుగు కథా, నవలా రచయిత చావా శివకోటి(82) తన రచనలతో సాహిత్యరం గానికి విశేష సేవలందించారనీ, ఆయన ఆకస్మిక మతితో సాహిత్యలోకం గొప్ప సాహితీవేత్తను కోల్పోయిందని తెలంగాణ సాహితి, సాహితీ స్రవంతి పేర్కొన్నాయి. ప్రజాసమస్యలపై ఆయన అనేక రచనలు చేశారని గుర్తు చేశాయి. దాశరథి రంగాచార్య సమకాలికుడిగా తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్షను శివకోటి తన రచనల ద్వారా ఎలుగెత్తి చాటారని పేర్కొన్నాయి. ఈమేరకు బుధవారం తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె ఆనందాచారి, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కెంగార మోహన్, కె.సత్యరంజన్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. 'తెలంగాణ ఉద్యమాలు, గ్రామాల స్వరూపాల గురించి రచించారు. సాహిత్యంపై ఉన్న అభిరుచితో కథలు, కవితలు, కవితా సంపుటిలు, నవలలు రాసిన ఆయన 'అసురగణం'నవలతో తెలుగు సాహిత్యంలో సంచలనాన్ని సష్టించింది. ఆయన 27 నవలలు రాయగా, ఆనాటి ప్రముఖ వార, మాస పత్రికలలో యువతను విపరీతంగా ఆకర్షించి ప్రజాదారణ పొందాయి. చావా శివకోటి గారు అనేక కథలు కూడా రచించారు. స్టువర్ట్పురం, కథలోరు కథలు పుస్తకాలతో పాటు అనేక నవలలు, వందలకు పైగా కథలు రాశారు. గోపీచంద్ శతజయంతి పేరుతో అప్పట్లోనే సాహిత్య సభలు నిర్వహించి సినారె, దాశరథి, వేటూరి, సిరివెన్నెల లాంటి ప్రసిద్ధ రచయితలను ఖమ్మం పిలిచి సన్మానించారు. సినారె, దాశరథిల సమకాలిక రచయితగా శివకోటి ప్రసిద్ధి పొందారు. సాహిత్యం రంగంలో ఆయన చేసిన కృషికిగాను 2020 డిసెంబరు 31న చివరిసారిగా గుడిపాటి వెంకటాచలం అవార్డును అందుకున్నారు. రావిశాస్త్రి, రచన మాస పత్రిక విశిష్టకథా పురస్కారం, త్రిపురనేని గోపీచంద్ స్మారక పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. శివకోటి గారు తన సాహితీజీవితంలో 27 నవలలు, 120కి పైగా కథలు రాయగా...పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 82 ఏళ్ల వయసులోనూ 'అనుబంధ బంధాలు', 'గతించిన గతం' నవలలను విడుదల చేశారు. సంచిక అనే పత్రికలో నేటికీ ఆయన నవల సీరియల్‌గా ప్రచురితమవుతోంది. 'సాహితీ-హారతి' పేరుతో మిత్రుడు డాక్టర్ హరీశ్ తో కలిసి సాంస్కతిక వేదికను ఏర్పాటు చేసి ఎందరో సాహితీవేత్తలను సత్కరించారు. యువ రచయితలను ప్రోత్సహించారు' అని వారు ఈసందర్భంగా స్మరించుకున్నారు. శివకోటి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగడ సానుభూతిని వ్యక్తం చేశారు.