Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ జలమండలిలో ఓఎస్డీ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరాచారి రచించిన ''తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం'' పుస్తకాన్ని రాష్ట్ర మున్సిపల్, పరిపాలనా శాఖా మంత్రి కేటీ రామారావు బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. రాష్ట్రం ఆవిర్భంచిన తర్వాత వ్యవసాయం, పశుపోషణ, సాగునీరు, విద్యా, వైద్యం, మున్సిపల్ పరిపాలన, పోలీసు, ఐటీ, అటవీ రంగాల్లో గత ఎనిమిదేండ్లలో సాధించిన అభివృధ్ధిని ఈ పుస్తకంలో వివరంగా పేర్కొన్న రచయిత మనోహరాచారిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. శరవేగంగా పురోగమిస్తున్న పట్టణ ప్రగతిలో భాగంగా 141 మున్సిపాలిటీలు, పలు కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఒక వినూత్నమైన, అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ బలపడుతున్నదని వివరించారు. దేశానికే రోల్‌మోడల్‌గా రాష్ట్ర ఐటీరంగం ప్రగతిని సాధిస్తున్నదని చెప్పారు. రాష్ట్రం సాధించిన, సాధిస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ పుస్తకంలో పేర్కొనడం అభినందనీయమని అన్నారు. మనోహరాచారిని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్, దులం సత్యనారాయణ, శ్రీ హర్ష పాల్గొన్నారు.