Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఎ ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గంలోని కిని గ్రామంలో ఆయన గురువారం పర్యటించారు. రైతులు, వివిధ వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ దేశమంతా అమలవుతాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అనతికాలంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి చేశారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశ ప్రజలందరికీ ఈ పథకాలు అమలు చేసి అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఊరూరా బీఆర్ఎస్ను విస్తరిస్తామని చెప్పారు. త్వరలో ప్రతి జిల్లాలో తాలూకా, గ్రామస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నాందేడ్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు రమేష్ రాథోడ్, సునీల్‌కుమార్ బజాజ్, అశోక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.