Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్‌ను విచారించడానికి అనుమతిని వ్వాలని ఈడీ అధికారులు గురువారం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నామని, ముఖ్యంగా మొయినాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని తాము ఈసీఐఆర్‌ను నమోదు చేశామని కోర్టుకు ఈడీ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని విచారించామని, తాజాగా నందకుమార్‌ను విచారించడానికి అనుమతినివ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతినిస్తే చంచల్‌గూడ జైల్లోనే నిందితుడిని విచారిస్తామని తెలియజేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతి స్వామిని, సింహయాజి స్వామిలను కూడా విచారించడానికి ఈడీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
అభిషేక్ ఆవుల ను విచారించిన ఈడీ
సెవెన్ హిల్స్ మానిక్‌చంద్ గుట్కా కంపెనీ అధిపతి అభిషేక్ ఆవుల ను గురువారం ఈడీ అదికారులు విచారించారు. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు ఉదయం 10.30 గంటలకు అభి షేక్ విచారణ అధికారుల ఎదుటకు వచ్చారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు అభిషేక్ విచారణ కొన సాగింది. కాగా, తనకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధం లేదనీ, ఇతర కేసుకు సంబంధించి విచారణకు వచ్చాననీ లోనికి వెళ్లే ముందు అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, రోహిత్‌రెడ్డి సోదరుడితో తనకు వ్యాపార లావాదేవీ లు ఉన్నాయని తెలిపారు. కాగా, అభిషేక్ లావాదేవీ లు, పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు తదితర కోణా ల్లోనే ఈడీ అధికారులు విచారించినట్టు తెలిసింది.