Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సంబంధించిన కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న షాదీ ఖానాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలనీ, శాఖపరంగా అందుకనుగుణమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖా కార్యదర్శి మహామ్మద్ నాదీమ్, డైరెక్టర్ షన్వాజ్ ఖాసీం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఉమాదేవి, విజయకుమార్ పాల్గొన్నారు.