Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ పేరు మారుస్తూ బులిటెన్ విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)గా మార్చారు. శాసనసభ, మండలిలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ గురువారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ జారీ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ ఇక నుంచి బీఆర్ఎస్ఎల్పీగా కార్యకలాపాలు నిర్వహించనుంది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 8వ తేదీన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. ఆ మరుసటి రోజే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈ నెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదితమే.