Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల భారీ బందోబస్తు
- నిర్వాసితుల అరెస్ట్
నవతెలంగాణ- భువనగిరి రూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలోని రాయగిరిలో త్రిబుల్ ఆర్ భూసర్వే చేస్తున్న అధికారులను గురువారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రూరల్ సీఐ వెంకటయ్య, ఎస్ఐ హెచ్.రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భూ నిర్వాసితుల్లో ముఖ్యమైన రైతులను ఇంటి వద్ద అరెస్టు చేశారు. రాయగిరి, కేసారం, పెంచికల పహాడ్, తుక్కాపూర్, గౌస్ నగర్ గ్రామాలలో అధికారులు సర్వే పూర్తి చేశారు. అనంతరం భూ నిర్వాసితులందరూ కుటుంబీకులతో కలిసి యాదాద్రి కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వరంగల్ హైవే వైపు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. వారిని భువనగిరి టౌన్, రూరల్, బొమ్మలరామారం పోలీసుస్టేషన్లకు తరలించారు. భువనగిరి పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్రెడ్డి రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. రాయగిరి గ్రామస్తులు గతంలో రోడ్డు నిర్మాణం కోసం, విద్యుత్తు లైన్ కోసం, ప్రణహిత చేవెళ్ల కాల్వ కోసం మూడు నుంచి నాలుగు సార్లు భూమిని కోల్పోయారని, మళ్లీ రాయగిరి గుండా త్రిబుల్ ఆర్ రోడ్డు పోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. త్రిబుల్ ఆర్ భూనిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తంగేళ్లపల్లి రవికుమార్, పల్లెర్ల యాదగిరి, అవి శెట్టి పాండు, వైకుంఠం, ఆంజనేయులు, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.