Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్లపై దిగ్విజరు సింగ్ ఆగ్రహం
- రేవంత్‌ను భరించలేం...
- మీడియా ఎదుట పార్టీని బదనాం చేస్తున్నరు
- ఇరువర్గాల ఆవేదన
- ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం : సీనియర్ల ఆందోళన
- సమిష్టి నిర్ణయాలను పట్టించుకోరు: రేవంత్ గ్రూప్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కష్ట కాలంలో పార్టీ అండగా ఉండాల్సిన సీనియర్లు పార్టీ బజారుపాల్జేస్తారా? అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని రక్షించాల్సిన మీరే...సమస్యగా మారితే ఎలా? ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి గానీ, మీడియా ఎదుట బహిర్గతం చేయడం ద్వారా ఏం సాధిస్తారంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇటు సీనియర్లు, అటు రేవంత్ గ్రూప్ దిగ్విజరు ఎదుట పరస్పర వాదనలు వినిపించారు. ఒక్కరిపై ఒకరు వారు ఫిర్యాదు చేసుకున్నట్టు తెలిసింది.
గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో దిగ్విజరుసింగ్ వన్ టు వన్ సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఏఐసీసీ దూతగా ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ఆయన సీనియర్ నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని దిగ్విజరు తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసు కున్నారు. అందరితో ఒకేసారి కాకుండా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. పార్టీ నేతలు జానారెడ్డి, టి జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క, సీతక్క, వి హనుమంతరావు, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, బలరాంనాయక్, మహేశ్వర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌షెట్కర్, జగ్గారెడ్డి తదితరులు ఆయన ఎదుట హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని భరించ లేపోతున్నామంటూ కొందరు నేతలు డిగ్గీ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ తీవ్రంగా నష్టపోతున్నదని వివరించారు. రేవంత్ తాను అనుకున్నదే పార్టీ కార్యక్రమంగా భావిస్తారనీ, తమ అభిప్రాయాలకు విలువలేకుండాపోయిందంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సమిష్టిగా నిర్ణయించిన కార్యక్రమాలను సీనియర్లు అమలు చేయరనీ, వివిధ సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపులను వారు అమలు చేయరని రేవంత్ వర్గీయులు చెప్పినట్టు తెలిపారు. అంతేకాకుండా పార్టీ అంతర్గత విషయాలను కూడా బహిర్గతం చేస్తూ పార్టీని బలహీన పరిచే ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. సమిష్టి ఆమోదంతోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే...ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారంటూ సీనియర్లపై ఫిర్యాదులు చేశారు.బీఆర్ఎస్ను ఓడిం చేందుకు మీ దగ్గర ఉన్న వ్యూహమేంటిి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేశారు? అంతర్గత సమ స్యపై మీ అభిప్రాయం చెప్పండి. వాటి పరిష్కారం కోసం మీరిచ్చే సలహా లేంటిిి? అంటూ దిగ్విజరు సీనియర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు.