Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు చేయనున్న ఆజాద్ ఇంజనీరింగ్
హైదరాబాద్ : ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్ మేడ్చల్ జిల్లాలో జపాన్‌కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండిస్టీస్ కోసం ప్రత్యేక తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ నూతన ప్లాంట్ కోసం 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.160 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ ప్లాంట్‌ను మేడ్చల్ సమీపంలోని తునికిబొల్లారంలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొంది. 2024 మధ్య నాటికి ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నా యని వెల్లడించింది. దీని ద్వారా 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో సగటున ఏడాదికి 35-40 శాతం వృద్థిని సాధించాలని ఆజాద్ ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.