Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు అదేనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని వివరించారు. ఇతర వివరాలకు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు ఐదు, అదే శాఖలో గ్రేడ్-2 పోస్టులు 106, ఎస్సీ అభివృద్ధి శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (మహిళ) పోస్టులు 70, అదే శాఖలో గ్రేడ్-2 (పురుషులు) పోస్టులు 228, బీసీ సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు 140, వికలాంగులు, వయోవృద్ధుల శాఖలో వార్డెన్ గ్రేడ్-1 పోస్టులు ఐదు, అదే శాఖలో మ్యాట్రన్ గ్రేడ్-1 పోస్టులు మూడు, వార్డెన్ గ్రేడ్-2 పోస్టులు మూడు, మ్యాట్రన్ గ్రేడ్-2 పోస్టులు రెండు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మహిళా సూపరింటెండెంట్ పోస్టులు 19 చొప్పున మొత్తం 581 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు.