Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ బాలిక కిడ్నాప్ కావడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే అప్రమ త్తమై ప్రత్యేక బృందాలతో గాలించగా సిద్ది పేటలో బాలిక ఆచూకీ లభ్యమైంది. మహం కాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్ బోయి గూడకు చెందిన రేణుక ఓ మెస్‌లో పని చేస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో రేణుక ఇంట్లో పనిలో నిమగమై ఉండగా ఆమె 6 ఏండ్ల కూతురు కృతిక బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దాంతో రేణుక పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు స్థానిక సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. రేణుక పని చేసే మెస్‌లోనే పని చేసే ఓ వ్యక్తితో బాలిక నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాలో కనిపించింది. దాంతో పోలీ సులు 10 బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బాలికను సిద్దిపేటలో పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.