Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మల్లుస్వరాజ్యం నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులుగా చుక్కరాములు, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేటలో మల్లు స్వరాజ్యం నగర్లోని సున్నం రాజయ్య ప్రాంగణంలో జరుగుతున్న ఆ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. 163 మందితో సీఐటీయూ కౌన్సిల్ను ఎన్నుకున్నారు. వర్కింగ్ కమిటీలో 125 మంది ఉంటారు. కోశాధికారిగా వంగూరు రాములు ఉండనున్నారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లుగా 26 మంది ఉండనున్నారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వీరయ్య, భూపాల్, ఎస్.రమ, పి.జయలక్ష్మి, కళ్యాణం వెంకటేశ్వరరావు, జె.మల్లిఖార్జున్, టి.వీరారెడ్డి, వీఎస్.రావు, కె.ఈశ్వర్రావు, రాజారెడ్డి, కార్యదర్శులుగా జె.వెంకటేశ్, పద్మశ్రీ, ముత్యంరావు, జె.చంద్రశేఖర్, బి.మధు, ఎం.వెంకటేశ్, బి.మల్లేశ్, ఏజే.రమేశ్, రాగుల రమేశ్, పి.శ్రీకాంత్, కూరపాటి రమేశ్, కె.గోపాలస్వామి, కోఆప్షన్(మహిళ) ఎన్నికయ్యారు.
ఆఫీస్ బేరర్ల నుంచి ఐదుగురు రిలీవ్
భవిష్యత్ ఉద్యమాల అవసరాలు, వయస్సు, ఇతరత్రా కారణాల రీత్యా సీఐటీయూ ఆఫీస్ బేరర్ల నుంచి సీనియర్ నాయకులు పి.రాజారావు, ఆర్.కోటంరాజు, మందా నర్సింహారావు, ఆర్.త్రివేణి, యాదానాయక్ రిలీవ్ అయ్యారు. మహాసభలకు హాజరైన వారిలో పి.రాజారావు(76) అత్యంత సీనియర్ నాయకులు. సీఐటీయూ ఆవిర్భావం నుంచి రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. రిలీవ్ అయిన వారి సేవలను మహాసభ గుర్తుకుచేసుకున్నది.