Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో పాతబస్సుల స్థానంలో రీప్లేస్మెంట్ కింద 1,016 సూపర్ లగ్జరీ కొత్త బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన ఈ బస్సుల్ని కొనుగోలు చేస్తున్నారు. వీటిలో మొదటి విడతగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు టీఎస్ఆర్టీసీ ఆర్డర్లు ఇచ్చింది. ఈ బస్సులన్నీ 2023 మార్చి నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. వీటిలో కొన్ని బస్సులను శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించనున్నారు. ఈ బస్సుల్లో పూర్తిస్థాయి అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సుల్లో ట్రాకింగ్ సిస్టం, ప్యానిక్ బటన్ సదుపాయం ఉంటాయి. ఇవి ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి ఉంటాయి. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే పానిక్ బటన్‌ను నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. దీనివల్ల అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటారు. ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లున్నాయి. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే సెక్యురిటీ కెమెరాలు ఉంటాయి. రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్‌డీఏఎస్) ఉంటుంది. బస్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరిగినా అలారం ఆటోమెటిక్‌గా మోగుతుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, వినోదం కోసం టీవీలు ఉంటాయి.