Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 29న ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్లో నిర్వహించే బహిరంగ సభాస్థలిని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని శుక్రవారం పరిశీలించారు. ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరన్ విజయన్ హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు సుమారు లక్షమంది వచ్చే అవకాశాలు ఉండటంతో దానికి తగిన రీతిలో ఏర్పాట్లు ఉండాలని తమ్మినేని వ్యకాస నాయకులకు సూచించారు. సభా ప్రాంగణంలో వేదిక ఎటువైపు, ఎలా ఉండాలి? అనే అంశాలపై పార్టీ నేతలతో గ్రౌండ్లోనే కొద్దిసేపు ముచ్చటించారు. బహిరంగ సభ ముఖ్య అతిథి కేరళ సీఎంకు భద్రత కల్పించేలా పోలీసులను సంప్రదించాలన్నారు. పరిశీలించిన వారిలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తదితరులు ఉన్నారు.