Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
20వ వార్షికోత్సవం సందర్భంగా తాము ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు ప్రజానీకం నుంచి చక్కని స్పందన వ్యక్తమౌతోందని నెం.1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్ 'సి' ఫౌండర్ అండ్ సీయండీ యం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్లో మొత్తం మూడు లక్కీ డ్రాలు తీయబడుతాయనీ, ఈ లక్కీ డ్రాలో విజేతలుగా ఎంపికైన కస్టమర్లకు 20 మారుతి సుజుకి ఆల్టో కార్లు, 20 బజాజ్ ప్లాటినా బైక్‌లు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తామని తెలిపారు.ఈ ఆఫర్ 29 జనవరి 2023 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా శుక్రవారం మొదటి లక్కీ డ్రా తీసి 6 మారుతి సుజుకి ఆల్టో కార్లు, 6 బజాజ్ ప్లాటినా బైక్‌లు, 6 రిఫ్రిజిలేటర్లు, 6 ఏసీలు, 6 టీవీలు మొత్తం 30 విజేతలను ప్రకటించారు.
వీటితో పాటు ప్రతి మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఖచ్ఛితమైన బహుమతి , 3000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ప్లస్ సులభ వాయిదాల పద్ధతిలో వడ్డి అండ్ డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్ కొనే సౌకర్యం కూడా కలదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మొబైల్ రిటైల్ రంగంలోనే మొట్ట మొదటి సారిగా యాక్ససరీస్ కొనుగోలుపై ఖచ్ఛితమైన బహుమతి ఇస్తున్నామని అన్నారు.