Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని వెల్లడించాలని కోరుతూ ప్రత్యర్థి కాంగ్రెస్ నేత మదన్మోహన్ వేసిన రిట్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో శుక్రవారం వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుదీర్ఘ వాదనలు పూర్తి అయ్యాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఆ ఎన్నికలప్పుడు పాటిల్ దాఖలు చేసిన అఫిడవిట్లో తనకుజార?ండ్‌లో ఉన్న క్రిమినల్ కేసు గురించి చెప్పలేదని, పాటిల్‌కు కోర్టు 500 ఫైన్ కూడా వేసిందని మదన్ లాయర్ వాదించారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును మదన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రతిని జత చేయలేదు. తీర్పు కాపీ అందలేదని చెప్పడంతో ఆ కేసును సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు పంపింది. తాజాగా హైకోర్టులో విచారణ పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేసింది.
హైకోర్టుకు హాజరైన పలువురు అధికారులు
హైదరాబాద్ సిటీలోని హిల్‌పోర్టు ప్యాలెస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిల్ విచారణకు పలువురు ఐఏఎస్ అధికారులు శుక్రవారం హైకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు. సీఎస్‌లతో కేంద్రం మీటింగ్ పెట్టిన కారణంగా ఆయన హాజరుకాలేదు. విచారణకు పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌రావు, హెచ్ఎండీయే తరఫున డైరెక్టర్ (ప్లానింగ్) బాలకష్ణ ఇతరులు కోర్టుకు హాజరయ్యారు. హిల్‌పోర్టు పునరుద్ధరణ చర్యల తీసుకునేందుకు అన్ని కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ చెప్పారు. చర్యల నివేదికను జనవరి 10న జరిగే విచారణలో అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సారధ్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఆదేశించింది.
ముందస్తు బెయిల్ కేసు 30కి వాయిదా
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో విచారణ 30వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ సుమలత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ాఇచ్చిన 41ఎ నోటీసులో అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని మణిలాల్ వేసిన రిట్ తరఫున వాదించేందుకు సమయం కావాలని లాయర్ కోరడంతో విచారణ 30వ తేదీకి వాయిదా పడింది.