Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాతపద్ధతిలోనే నిర్వహించాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, పరుగుకు సంబంధించిన అర్హత మీటర్లను పెంచడంతో చాలా మంది ఎంపికయ్యే అర్హతను కోల్పోతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. అందువల్ల పాతపద్ధతిలోనే దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దేహదారుఢ్య పరీక్షలో భాగంగా 3.80 మీటర్లుగా ఉన్న లాంగ్‌జంప్ దూరాన్ని నాలుగు మీటర్లకు పెంచారని తెలిపారు. 5.6 మీటర్లుగా ఉన్న షాట్‌పుట్‌ను ఆరు మీటర్లకు పెంచారని పేర్కొ న్నారు. 800 మీటర్లుగా ఉన్న పరుగును 1,600 మీటర్లకు పెంచారని వివరించారు. దీనికి తోడు డిజిటల్ పద్ధతి ద్వారా ఎత్తు కొలవడంతో సాంకేతిక లోపం వల్ల చాలా మంది అభ్యర్థులు ఎంపికయ్యే అర్హతను కోల్పోతున్నారని తెలిపారు. కాబట్టి పాత పద్ధతిలోనే లాంగ్‌జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరుగు అనంతరం రెండు గంటలు లేదా ఒక రోజు సమయమిచ్చి లాంగ్‌జంప్, షాట్‌పుట్ వంటి ఇతర పరీక్షలను నిర్వహించాలని కోరారు. పాత నోటిఫి కేషన్లో కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, సివిల్ విభాగాల్లో బెస్ట్ ఆఫ్ టూ ఈవెంట్స్‌ను అమలు చేయాలంటూ పేర్కొన్నారని గుర్తు చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ఈవెంట్లను నిర్వ హించాలని తెలిపారు. లాంగ్ జంప్‌లో ఆన్ ద లైన్ జంప్‌ను అనుమతించాలని పేర్కొన్నారు. డిజిటల్ విధానాన్ని తీసేసి, పాత పద్ధతినే మ్యానువల్‌గా అభ్యర్ధుల ఎత్తు, కొలతలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.