Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ అధ్యక్షత వహించారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కేక్ కట్ చేశారు. నేషనల్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ డాక్టర్ కాపు కుమార్ పవిత్ర బైబిల్ గ్రంథంతో ప్రార్థన చేసి, పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని చెప్పారు. ప్రేమతత్వాన్ని ప్రబోధించిన జీసెస్ బోధనలు అందరికీ అనుసరణీయమన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర బైబిల్ గ్రంథంలో సమాజంలో అందరూ సోదరభావంతో ఉండాలన్నారు. టీడీపీ కుటుంబం సమాజ సేవలో పాలు పంచుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంభంపాటి రామమోహన్ రావు, తిరునగరి జ్యోత్స్న , రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జివిజి నాయుడు , షేక్ ఆరిఫ్ , చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ యాదవ్, నాయకులు అట్లూరి సుబ్బారావు, సంధ్యపోగు రాజశేఖర్ , జి. యాదగిరి , సంధ్యపోగు సత్యరాజ్ , శ్రీపతి మహేందర్ , వెంకట్ రెడ్డి , రాఘవులు , షకీలా రెడ్డి , పద్మాచౌదరి , సూర్యదేవర లత తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ చిన్న పీటర్ పాల్ కూడా వేడుకలలో పాలుపంచుకున్నారు.