Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ నేతన్నలను నయ వంచనకు గురి చేశారని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగిన నేతన్నల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నల్లా సత్యనారాయణ కుటుంబాన్ని సహచర నాయకులతో కలిసి ఆయన శుక్రవారం పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్నారు. తక్షణ సహాయంగా బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలనీ, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియోనివ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సొంత ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరారు.