Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు డీఎడ్తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎడ్తో డిగ్రీ పూర్తి చేసిన వారు లక్ష మంది వరకు అభ్యర్థులున్నారని తెలిపారు. 2011, జూన్ 28న జారీ చేసిన జీవో నెంబర్ 45 ద్వారా 2018లో గిరిజన సంక్షేమ శాఖలో వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు బీఎడ్తోపాటు డీఎడ్తో డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశమిచ్చారని గుర్తు చేశారు. నాలుగు నెలల క్రితం ఏపీలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లోనూ వారికి అవకాశం కల్పించారని తెలిపారు.
కానీ శుక్రవారం టీఎస్పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లో ఆ పోస్టులకు 45 జీవో ప్రకారం కేవలం బీఎడ్ అభ్యర్థులే అర్హులని ప్రకటించిందని పేర్కొ న్నారు. దీనివల్ల లక్ష మంది అభ్యర్థులు ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకా శాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నోటిఫికేషన్ను వెంటనే సవరించి డీఎడ్తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.