Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు మార్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రెండు ప్రయివేటు జూనియర్ కాలేజీల షిఫ్టింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అదనపు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఏఐఎంఐఎం ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రతిపాదనల ఆధారంగా కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతి ఇచ్చామని తెలిపారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని ఓవైసీ జూనియర్ కాలేజీని హైదరాబాద్‌లోని బండ్లగూడ హఫీజ్ బాబానగర్‌లో ఉన్న ఓమర్ కాలనీకి మారుస్తున్నామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టనంలో ఉన్న ఓవైసీ జూనియర్ కాలేజీని హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న ఎంఎం కాలనీకి మారుస్తున్నామని తెలిపారు.