Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్'ఫై పీడీఎస్యూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ విద్యా విధానం అమలు పేరిట విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో అర్హత లేని వారిని అధ్యాపకులుగా నియమించే ప్రక్రియను మానుకోవాలని పీడీఎస్యూ... రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పి.రామకృష్ణ, ఎన్.ఆజాద్ మాట్లాడుతూ... వర్శిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని తెలిపారు. పీజీ, పీహెచ్డీ, నెట్, సెట్లాంటి అర్హతలున్న వారిని సైతం పక్కనబెట్టి ఎలాంటి అర్హతలు లేని వారిని నిపుణుల పేరుతో నియమించజూడటం శోచనీయమని విమర్శించారు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.