Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల్ని ఆహ్వానించిన టామ్‌కామ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జపాన్‌లో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సుల రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇప్పటికే తొలి విడతలో ఎంపికైన నర్సులకు స్క్రీనింగ్ పరీక్షను పూర్తిచేసి, ఈనెల 27 నుంచి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. రెండో విడత అభ్యర్థుల రిక్రూట్మెంట్ కోసం ఈనెల 27వ తేదీ రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో మరో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 22 నుంచి 35 ఏండ్ల మధ్య వయసు కలిగిన బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జీఎన్ఎమ్ డిప్లొమా హౌల్డర్లు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ముందస్తు పని అనుభవం అవసరం లేదనీ, ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణ, జపాన్‌లో పనిచేయడానికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు అందచేస్తామన్నారు. నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదించుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఫోన్ నెంబర్లు 91007 98204, 99088 30438లో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.