Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదంలో ఇద్దరు పారిశుధ్య కార్మికుల మృతి
నవ తెలంగాణ-మెదక్‌టౌన్
వేగంగా వచ్చిన కారు ఢకొీన్న ప్రమాదంలో ఇద్దరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరికి స్వల్ప గాయాలైన సంఘటన జిల్లా కేంద్రమైన మెదక్‌లో జరిగింది. ఎస్ఐ మల్లారెడ్డి కథనం ప్రకారం... శనివారం ఉదయం విధులు నిర్వహించడానికి పారిశుధ్య కార్మికులు నర్సమ్మ(53), యాదమ్మ(55), మరియమ్మ మున్సిపల్‌కు వెళ్తున్నారు. మున్సిపల్ సమీపంలోని పెట్రోల్ బంకులో పని చేస్తున్న శాంతమ్మ, జయమ్మ అక్కడ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఐదుగురు మహిళలను ఢకొీట్టింది. దాంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదమ్మ మృతి చెందింది. మెరుగైన చికిత్స కోసం శాంతమ్మ, జయమ్మను హైదరాబాద్‌లోని గాంధీకి తరలించారు. మరియమ్మకు మెదక్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు తోటి కార్మికులు ఆందోళన నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పోలీసులు, మున్సిపల్ అధికారులు కార్మికుల న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సంతాపం తెలిపిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని వారికి పూల మాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.20 వేలు అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇ చ్చారు. బాధితుల కుటుంబాలను అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వైస్ చైర్మెన్ మల్లిఖార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు భీమరి కిషోర్‌కుమార్, రాజు, రాజలింగం, శ్రీని వాస్, వసంత్ పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, కోఆప్షన్ మెంబర్ ఉమర్ మోహియోద్దిన్, నాయకులు రాగి అశోక్, కృష్ణ, ప్రవీణ్ పరామర్శించారు. మృతు ల కుటుంబాలకు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. కౌన్సి లర్లు రాజలింగం, వసంతరాజ్, సుమన్, శేఖర్, మాజీ కౌన్సిలర్ రాజు తదిత రులున్నారు.