Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలోని తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా జి పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. టీజీవో నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ శనివారం ఎన్నికలను నిర్వహించారు. ప్రదీప్కుమార్కు చెందిన పురుషోత్తంరెడ్డి ప్యానెల్ విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా వై పరుశురామ్, సభ్యులుగా శ్రీనివాసరావు, శిరీష, లావణ్య, కవిత, సైదులు, సాయిరెడ్డి, సత్యనారాయణ, రవికుమార్, కృష్ణయ్య, శ్రీనివాస్, సుధాకర్, వీణ, సుభద్ర తదితరులు గెలిచారు. నూతన కమిటీని టీజీవో అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు అభినందించారు.