Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు ఆర్‌యూపీపీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భాషా పండితుల పదోన్నతులకు సంబంధించిన రెండు, మూడు సర్వీసు రూల్స్‌పై హైకోర్టులో ఉన్న స్టేను వెంటనే తొలగించేలా ప్రభుత్వం చొరవ చూపాలని ఆర్‌యూపీపీటీఎస్ కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను శనివారం వేర్వేరుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. భాషాపండితుల అప్‌గ్రేడ్ జీవో 110ను అమలు చేయాలని కోరారు. పరస్పర బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులందరి కీ మరోసారి అవకాశామివ్వాలని సూచించారు. ఈ అంశాలపై మంత్రితో పాటు అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల గురునాథం తదితరులు పాల్గొన్నారు.