Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి ఆచరణీయమని శనివారం వేర్వేరుగా విడుదల చేసిన ప్రకటనల్లో వారు పేర్కొన్నారు. శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని సీఎం తెలిపారు. ఒకవైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా... మరోవైపు సమాజంలో మాన వీయ విలువలు మృగ్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో క్రీస్తు బోధనలను ఆచరించటం ద్వారా తోటి మానవులను ప్రేమించాలని ఆయన ఆకాంక్షించారు.