Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు విద్యాసంవత్సరాల వరకు అనుమతి
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. అనుబంధ గుర్తింపు పొందేందుకు ఉన్న నిబంధనలను సడలించింది. రెండు విద్యాసంవత్సరాల వరకు అనుమతినిచ్చింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న జూనియర్ కాలేజీలు హోం శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 29లోని సెక్షన్ నాలుగు పారా మూడును నిలిపేస్తున్నట్టు తెలిపారు. ఆ నిబంధనలకు సడలింపునిస్తూ ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం జూనియర్ కాలేజీలు గుర్తింపు పొందాలంటే తప్పని సరిగా ఫైర్ ఎన్వోసీని ఇంటర్ బోర్డుకు సమర్పిం చాల్సి ఉంటుందని తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యా సంవ త్సరాల్లో ఆ నిబంధనలకు సడలింపునిచ్చామని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన మినహాయింపును ప్రస్తుత విద్యాసంవత్సరంతోపాటు వచ్చే విద్యా సంవత్సరా నికి కూడా వర్తింపచేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజ మాన్యాల సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి మేరకు 29 జీవో అమలును నిలిపేస్తున్నట్టు వివరించారు. ఆ తర్వాత పొడిగింపు ఉండబోదని స్పష్టం చేశారు.
టీపీజేఎంఏ హర్షం
మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న జూనియర్ కాలేజీలకు నిబంధనలను సడలింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టీపీజేఎంఏ అధ్యక్షు లు గౌరి సతీశ్ హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో సు మారు 435 ప్రయివేటు జూనియర్ కాలేజీలు మిక్స్ డ్ ఆక్యుపెన్సీలో ఉన్నాయని ప్రకటనలో తెలిపారు. వాటిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సం వత్సరంలో కలిపి సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు చ దువుతున్నారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ కార్యదర్శి వాకా టి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాత కాలేజీలకు ఈ నిబం ధనను శాశ్వతం వర్తిం పచేయకుండా ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాలని కోరారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉండే కొత్త కాలేజీల వరకే ఫైర్ ఎన్వోసీ నిబంధనను పరిమితం చేయాలని సూచించారు.