Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్‌సి ఎల్ రమణ
హైదరాబాద్ : భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని ఎంఎల్‌సి ఎల్ రమణ అన్నారు. బేగంపేటలోని కాలినారి హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్ట్యూట్లో క్రిస్మస్, ఆజాదిక అమత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్స్ట్యూట్ చెఫ్‌లు, విద్యార్థులు కలిసి 29 రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలను వండి భారతదేశ పటంపై అందంగా పేర్చారు. సుమారు 600 రకాల వంటకాలను వండి అద్భుతంగా అలంకరించారు. దీనిని వీక్షించిన ఎల్ రమణ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలినరి ఇన్స్ట్యూట్ విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.