Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిలో నిందితుడి వదిన మృతి
నవ తెలంగాణ-అమీన్పూర్
కాపురానికి రావడం లేదన్న కోపంతో భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై భర్త దాడి చేశాడు. ఈ దాడిలో అతని భార్య అక్క అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్ నివాసి శ్రీనివాస్, భార్య సునీత కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.
సునీత అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణినగర్‌లో తన అక్క సుజాత ఇంట్లో నివాసం ఉంటూ అరబిందో పరిశ్రమలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో సునీత, అతని వదిన సుజాత, సుజాత కుమారుడు సాయికిరణ్‌పై శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సుజాత(48) అక్కడికక్కడే మృతి చెందగా, సునీత, సాయికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.