Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాపూర్
యాసంగి పంట సాగు కోసం కరీంనగర్లోని ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి నీటిని శనివారం ఎస్పారెస్సీ కాకతీయ కాలువ ద్వారా దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ఈఎన్సీ బి.శంకర్ మాట్లాడుతూ.. రైతుల అవసరాల నిమిత్తం క్రమక్రమంగా నీటి విడుదల 500 క్యూసెక్కుల నుంచి 4000 క్యూసెక్కుల వరకు పెంచుతామన్నారు. ఈ నీటి విడుదల ఏప్రిల్ వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ అధికారులు పాల్గొన్నారు.