Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఐదేండ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్ (క్లాట్)-2023 ఫలితాల్లో శ్రీచైతన్య ఐఏఎస్ అకాడమి విద్యార్థులు అత్యధికంగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఆర్ జోషిత 28వ ర్యాంకు, పి జ్యోతి 132వ ర్యాంకు, భూక్యా కార్తిక్ 155వ ర్యాంకు, బి చంద్రశేఖర్ 199వ ర్యాంకు, కె రాహుల్ 252వ ర్యాంకు, వి వెన్నెల 363వ ర్యాంకు, భూక్యా దీపక్ 484వ ర్యాంకు, పిఆర్ ఠాగూర్రెడ్డి 710వ ర్యాంకు, పి దిలీషశ్రీ 722వ ర్యాంకు, కె శ్రీహారిక 1903వ ర్యాంకు, ఆర్ మెహర్ కుల్సుమ్ 2401వ ర్యాంకు, ఎం విజయశంకర్ 2847వ ర్యాంకు, ఆర్డి సత్యరేష్మా 3100వ వంటి ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ కో ఫౌండర్ సుష్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సివిల్స్తోపాటు క్లాట్, సీయూఈటీ, ఐపీఎం వంటి ప్రతిష్టాత్మకమైన పోటీపరీక్షలకు తమ సంస్థలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. క్లాట్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు అభినందించారు.