Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
- జాతీయ మహాసభల్లో పలు సమస్యలపై చర్చిస్తాం
- 12 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు
- సోమవారం బహిరంగ సభ :ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ వ్యాప్తంగా వికలాంగులకు ఒకే పెన్షన్ విధానం కోసం ఉద్యమాలు చేపట్టనున్నట్టు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు హైదరాబాద్లో సంఘం అఖిలభారత మూడో మహాసభలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఈ మహాసభలకు 12 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. గడిచిన ఎనిమిదేండ్ల లో కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వికలాంగుల హక్కు లపై దాడి చేస్తున్నదనీ, కేంద్రం చట్టాలను మార్చేం దుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. వికలాంగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందనీ, బడ్జెట్ కేటాయిం పుల్లో మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. అరకొరగా కేటాయించిన నిధుల్లో 35 శాతం కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. యాక్సిసబుల్ ఇండి యా, సుగంధ భారత్ అభియాన్, దివ్యాంగ్ వంటి పేర్లతో వికలాంగులను మోసం చేస్తున్నదని విమ ర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించడంలో, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపి స్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.300 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు అత్యాచారాలు పెరిగిపోతున్నా వాటిని అరికట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మహాసభల్లో చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ మహాసభల సందర్భంగా సోమవారం ఇందిరా పార్క్ దగ్గర బహిరంగసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి కాంతి గంగులి, హాజరవుతున్నారన్నారు. వికలాంగుల సాధికారతపై మంగళవారం జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ కోశాధికారి ఆర్ వెంకటేష్ పాల్గొన్నారు.