Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మనుధర్మ శాస్త్ర ప్రతుల దహనాలు జరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల (కెేవీపీఎస్్, తెలంగాణ విద్యావంతుల వేదిక, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణప్రదేశ్ ఎరుకల సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేశారు. చిట్యాల, మిర్యాలగూడ, నకిరేకల్, నార్కట్‌పల్లిలో నినాదాలు చేసుకుంటూ ప్రతులను దహనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి ప్రతులను కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దహనం చేశారు. హైదరాబాద్‌లోని ఓయూలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కేఎన్వీ, పీడీఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో మనుస్మతి ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మనువాద, బ్రాహ్మణీయ విధానాలకు వ్యతిరేకంగా, అసమానతలు లేని సమసమాజ స్థాపనకై విద్యార్థి లోకం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈసీఐఎల్‌లోని కమలానగర్లో స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన దహన కార్యక్రమంలో పీఎస్ఎన్ మూర్తి, శ్రీమన్నారాయణ, కోమటి రవి, వెంకట్ పాల్గొన్నారు.
మనువాదాన్ని వ్యతిరేకిద్దాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేవీపీఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మనుస్మతి పత్రాలను దహనం చేశారు. వికారాబాద్ పట్టణంలో మనుస్మతి పత్రాలను దహనం చేశారు. తాండూర్, దుద్యాల, కొడంగల్ మండలకేంద్రాల్లో విద్యార్థి, ప్రజాసంఘాలు, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, ఆమనగల్ మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మతి పత్రాలను దహనం చేశారు. కుల వ్యవస్థను బలపరుస్తూ శూద్రులను, మహిళలను చదువుకోవద్దని చెప్పడం, ఆస్తులు కలిగి ఉండడం,అభరణాలు ధరించడాన్ని నిషేధించడపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిలా ్లకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మనుధర్మ శాస్త్రం పత్రాలను ఆదివారం దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దళిత, భహుజన సంఘాలు, శ్రామిక సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మస్మృతి ప్రతులను దహనం చేశారు. కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మనుస్మృతి ప్రతుల దహనం జరిగింది.
దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్‌ఎంఎం) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా కేవీపీఎస్ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని జర్నలిస్ట్ కాలనీలో మనుధర్మ శాస్త్రం పత్రాలను దగ్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దేవుని పేరుతో అణచివేసే మనుస్మతి ప్రతులను జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని నినదించారు. అలాగే పాలకుర్తి మండలం మంచుప్పులలో మను ధర్మ శాస్త్రాన్ని దహనం చేశారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఎస్ఎస్, ఏబిఎస్ఎఫ్, కేవీపీఎస్, పూలే యువజన సంఘం నాయకులు మనుస్మతి ప్రతులను దహనం చేశారు