Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంచెం నిప్పు-కొంచెం నీరు పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-అడిక్మెట్
దేశంలో జరిగే సామాజిక సాంస్కృతిక రాజకీయాలపై అరణ్య కృష్ణ చేసిన ప్రయత్నం గొప్ప అంశం అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో అరణ్యకృష్ణ రచించిన కొంచెం నిప్పు-కొంచెం నీరు పుస్తకాన్ని ప్రఖ్యాత రచయిత ఓల్గా అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, ఆత్మీయ అతిథులుగా కె.సజయ, తేళ్ల అరుణ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల దేశంలోని స్త్రీలు పడుతున్న భాధలు, వారి సమస్యలపై రచయిత అరణ్యకృష్ణ చక్కగా తన రచనలో స్పష్టం చేశారని అన్నారు. ప్రతీ కుల హత్య వెనుక పరువు ఉంటుందని, ప్రతీ పరువు వెనుక జెండర్ రాజకీయాలు, ఆస్తి రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని రచయిత చక్కగా వివరించారని తెలిపారు. దేశంలో ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులను ఆయన తన రచనల ద్వారా చెప్పడం ఇప్పుడు చాలా అవసరమన్నారు.