Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కృష్ణ
ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం చేగుంట గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఆదివారం చోటుచేసుకున్నది. రైల్వే పోలీసులు, బంధువు లు తెలిపిన వివరాల ప్రకారం తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆదివారం తెల్లవారుజామున చేగుంట రైల్వే స్టేషన్ పక్కన రైలు పట్టాలపై పడుకొని ప్రేమికులు బలవన్మరణం చేసుకున్నా రు. వారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఎమ్మాగనూరు. ఆంధ్ర నుంచి తెలంగాణ ప్రాంతానికి చేగుంట గ్రామానికి వలస కూలీలుగా వచ్చారు. ఏడాది నుంచి వారి కుటుంబ సభ్యులు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మణికుమార్ (25) అనిత (16) మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఈ విషయం తమ కుటుంబ సభ్యులకు తెలియడంతో పిలిచి మందలించారు. ఆ అమ్మాయి మణికుమార్‌కు వరుసకు కూతురు అవుతుందని తెలపడంతో తమకు పెళ్ళి జరగదని తెలిసి పక్కనే ఉన్న రైల్వే పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.