Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య ప్రతిభ
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందనలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బుర్ర లాస్య తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్ కోచ్‌గా ఎంపిక య్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అకాడమీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కోచ్ ఎంపిక పరీక్ష నిర్వహించింది. దేశంలో ఎంపికైన ముగ్గురు క్రీడాకారుల్లో లాస్య ఒకరిగా నిలిచారు. బాల్యం నుంచే లాస్యకు క్రికెట్ అంటే మక్కువ. అదే ఆసక్తితో క్రికెట్ ఆటపై మెలకువలపై హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఐసీసీ నిర్వహించే మొదటి శ్రేణి శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించి కోచ్‌గా ఎదిగారు. శనివారం తండ్రి రమేష్‌తో కలిసి రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలవగా ఆమెను మంత్రి అభినందించారు. రాష్ట్రం గర్వించేలా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. లాస్య తల్లి సునీత జాతీయ అథ్లెట్, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన, క్రీడల అధికారిణి. కాగా తండ్రి రమేష్ వాలీబాల్ క్రీడాకారుడు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. క్రికెట్లో మెరుగైన శిక్షణ ఇస్తూ ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్ద డమే తన లక్ష్యమని లాస్య తెలిపారు. లాస్య ఎంపిక పట్ల జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.