Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక బస్సులు ఏర్పాటు టిక్కెట్ రూ.1,600
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజారవాణాలో ఇటీవలి కాలంలో పలు సంస్కరణలు ప్రవేశపెడుతున్న టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు సరికొత్తగా 'సింగరేణి దర్శిని' పేరుతో పర్యాటక ట్రిప్‌ను రూపకల్పన చేసింది. ప్రాణహిత-గోదావరి వ్యాలీ పరిధిలో 350 కిలోమీటర్ల విస్తరించిఉన్న సింగరేణి ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్ బొగ్గు గనుల్లో పర్యటించే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్నది. ఒక్కో టిక్కెట్ ఖరీదును రూ.1,600గా నిర్ణయించారు. ఈ పర్యటనలో అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనులు, జైపూర్ పవర్‌ప్లాంట్, రెస్క్యూ స్టేషన్లను చూపిస్తారు. ఆర్టీసీనే మధ్యాహ్నం శాఖాహార భోజనం కల్పిస్తుంది. టిక్కెట్ దరలోనే ఆయా ప్రదేశాల ఎంట్రీ రుసుం కూడా కలిసి ఉంటుంది. హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, (ఎమ్జీబీఎస్), జూబ్లీ బస్టేషన్ల నుంచి ఈ పర్యాటక బస్సులు బయల్దేరతాయి. ఆయా ప్రాంతాలను సందర్శించాలనుకొనే ఔత్సాహికులు, విద్యార్థులకు ఈ ట్రిప్ ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.