Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ సహ పలువురి సంతాపం..
- విషాదంలో తెలుగు చిత్రపరిశ్రమ
హైదరాబాద్ :ప్రముఖ సినీ నటుడు టి. చలపతిరావు మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని తెలిపారు. వైవిధ్యంతో కూడిన పల రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతి రావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారని సిఎం అన్నారు. నటుడిగా, నిర్మాతగా మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు మరణం, సినీ రంగానికి తీరని లోటని సిఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు చిత్రపరిశ్రమకు తీరనిలోటు : రేవంత్ రెడ్డి..
తన విలక్షణ నటనతో చలపతిరావు తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటులు అయ్యారు.ఆయన మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.ఈ ఏడాది వరసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధగా ఉంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావ్ లు వరసగా మరణించడం చిత్రరంగానికి లోటు అని పేర్కొన్నారు.
మంచి నటులను కోల్పోవడం బాధాకరం: ఎర్రబెల్లి
సీనియర్ సినీ నటులు, తెలుగు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన ప్రేక్షకులను అలరించిన చలపతిరావు మృతిపట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సినీపరిశ్రమ వరుసగా మంచి నటులను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.