Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్ల మరమ్మతు చేయాలని సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు గుంతలమయ్యాయి. రోడ్లు మరమ్మతు చేయకపోవడంతో ప్రమాదాలకు కారణం అవుతున్నాయని సీపీఐ(ఎం) నాయకులు మండిపడ్డారు. గుంతలమయంగా మారిన రహదారులను ఆదివారం సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. రోడ్ల పరిస్థితిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సంకే రవి మట్లాడుతూ అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకునే నాయకులకు అధ్వానంగా మారిన రహదారులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి బైపాస్ రోడ్డు దుమ్ముదూళితో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్ల రోడ్ల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. బైపాస్ రోడ్డుతో పాటు ఫ్లైఓవర్ రోడ్డు గుంతలుగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల వల్ల అనేకమంది క్షతగాత్రులుగా మారుతున్నారని, అన్ని విధాలుగా ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. అధికారులు నాయకులు స్పందించి రోడ్ల మరమ్మతు చేపట్టాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుమాస ప్రకాష్, దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, దూలం శ్రీనివాస్, బోడంకి చందు, జిల్లా కమిటీ సభ్యుడు డి.మోహన్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.