Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి గచ్చిబౌలి విప్రో జంక్షన్ వద్ద టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న వాహనాలపైకి టిప్పర్ దూసు కెళ్లింది. ఈ ఘటనలో ఫుడ్ డెలివరీ బాయ్ మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరా బాద్ ఐఐటీ నుంచి కాంటినెంటల్ ఆస్పత్రికి పోయే దారిలో విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగల్ పడింది. నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లు ఆగాయి. వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం వాటిపైకి దూసుకెళ్లింది. టిప్పర్ వేగానికి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న నాసిర్ హుస్సేన్(26) మృతిచెందాడు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆరుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. టిప్పర్ డ్రైవర్ హరి అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉంది.