Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని జగద్గురు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన 270 క్షేత్రాలను స్వయంగా సందర్శించి వాటిపై డాక్టర్ ఎం.కనకాచారి పుస్తక సంకలనాన్ని వెలువరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో డాక్టర్ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి, రఘురామ శర్మ ఆయా సంకలనాలను ఆవిష్కరించారు. వశిష్ట ఆశ్రమం పీఠాధిపతి మధుసూదనాచార్యులు వాటిపై ప్రసంగించారు. మాతాజీ సరళ గ్రంథ సహాయకులు శ్రీమార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. పూనాలోని రాజ్యలక్ష్మి మాతాజీ గ్రంథకర్తను అభినందిస్తూ సందేశాన్ని పంపించారు. గ్రంధావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాసోజు భాస్కరాచారి, వాసుదేవరావుకి ఈ సందర్భంగా కనకాచారి ధన్యవాదాలు తెలిపారు.