Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ప్రజలు తిరస్కరించారు:కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో విజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బాధ్యతను మరింత పెంచిందని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా, ప్రజలు ఆపార్టీని తిరస్కరించారని తెలిపారు. బీజేపీ విద్యుత్ సంస్కరణల పేరుతో ఆ రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠమని అన్నారు. 'సెస్' ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయనీ, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందనీ, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావిం చారనీ, అందుకే ఆపార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని సోమవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ భారీ గా డబ్బులు వెదజల్లి, సాధారణ ఎన్నికల మాదిరి విచ్చల విడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కి, అనేక ప్రలోభాలకు తెరలేపినా, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు.