Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది మంది అరెస్టు
నవతెలంగాణ-ప్రత్యేకప్రతినిధి
హైదరాబాద్‌లో భారీ ఎత్తున మాదక పదార్థాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. అంతేగాక, మాదక పదార్థాల తయారీ, రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన అధికారులు.. మరో స్మగ్లర్‌ను యూపీ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేశారు. డీఆర్ఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా లేబోరేటరీలు ఏర్పాటు చేసి మాదక పదార్థాల తయారీకి ఒక ముఠా పాల్పడుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో గత 21వ తేదీ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన డీఆర్ఐ అధికారులకు రెండు రహస్య లేబోరేటరీల ఆచూకీ లభించింది. దాంతో వాటిపై దాడి చేసిన అధికారులు భారీ మొత్తంలో మెతడిన్ మాదక పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. అంతేగాక, మాదకపదార్థాల తయారీ, రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవ్యక్తి అక్కడి నుండి పారిపోయి నేపాల్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. యూపీలోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ స్మగ్లర్ నుంచి రూ. 60 లక్షల నగదును స్వాధీనపర్చుకురన్నారు. హైదరాబాద్‌లో పట్టుబడ్డ మాదక పదార్థాల విలువ రూ. 50 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు అంచనా వేశారు. పట్టుబడ్డ ఏడుగురిలో ఇద్దరు నిందితులు రెండు హత్యలతోనూ సంబంధాలున్నాయని అధకారులు తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు సాగుతుందని వెల్లడించారు.