Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీబీఐ, ఈడీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి బదిలీ చేయటంపై న్యాయనిపుణుల సలహా తీసుకున్నానని, కోర్టు ఆదేశాలకు సంబంధించిన కాపీ వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు సరిగ్గా జరుగుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈడీకి సంబంధం లేకున్నా తనకు నోటీసులిచ్చిందని తెలిపారు. ఈడీ విచారణలో ఏమి దొరకనందునే సీబీఐని బీజేపీ వాడుకుంటున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీ న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు.