Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27, 28 వరకు ప్రతినిధుల సభ
- హాజరుకానున్న 300మంది ప్రతినిధులు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
ఎన్పీఆర్డీ జాతీయ మహాసభ ఈ నెల 27, 28 తేదీల్లో యాదాద్రిభునగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామంలో జరగనుంది. జాతీయ మూడో మహాసభకు ఆహ్వాన సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. సెయింట్‌మేరీ ఇంజినీరింగ్ కాలేజీలో జరగనున్న మహాసభకు 12రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 27న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న సెమినార్‌కు రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కేరళ ఉన్నత విద్య సోషల్ జస్టిస్ మంత్రి ఆర్.బిందు, తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఎన్పీఆర్డీ జాతీయ అధ్యక్షులు క్రాంతి గంగూలీ, ప్రధాన కార్యదర్శి మురళీధరన్ హాజరుకానున్నట్టు ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య తెలిపారు. వికలాంగులు అధిక సంఖ్యలో విచ్చేసి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జెండా ఆవిష్కరణ
దేశ్‌ముఖ్ గ్రామంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ సోమవారం జెండాను ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు జిల్లా నేతలు, వికలాంగులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల శ్రవణ్ కట్కూరు ఆదర్శ్ రాసాల కిష్టయ్య బైకాని లక్ష్మమ్మ మేకల అచ్చయ్య ,కర్రోల అంజయ్య, తోటకూరి వెంకటేశం, కన్నబోయిన తదితరులు పాల్గొన్నారు.