Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ రద్దు : హైకోర్టు తీర్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేలను కొనుగోలు కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీచేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తును సిట్ కొనసాగించేందుకు వీల్లేదనీ, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను రద్దు చేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. గతంలో సిట్ దర్యాప్తుకు సంబంధతించిర రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా సీఎం మీడియా సమావేశంలో అందుకు చెందిన వీడియోలు ఇతర కీలక ఆధారాలు విడుదల చేశారనీ, అవి కేసీఆర్‌కు ఎలా చేరాయో సిట్ చెప్పలేదని హైకోర్టు తెలిపింది. దీనిపైనే నిందితులు ఆందోళన వ్యక్తం చేశారనీ, వారికీ హక్కులుంటాయనీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ప్రకారం వాళ్ల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని చెప్పింది. నిందితులు భయాందోళనతో ఉంటే దర్యాప్తు ఏకపక్షంగా ఉందనే అభియోగాల నేపథ్యంలో వాళ్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ కేసుతో ఏ సంబంధం లేని బీజేపీ రిట్ దాఖలు చేయడం చెల్లదనీ, ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదనీ, అందుకే ఆ పార్టీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్ కోరే, సింహయాజి, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ వేర్వేరుగా వేసిన రిట్లను అనుమతిస్తూ తీర్పు చెబుతున్నట్టు జస్టిస్ బి విజరుసేన్‌రెడ్డి చెప్పారు. తీర్పులోకి ముఖ్య విషయాలను జడ్జి చెప్పిన తర్వాత ఏజీ బిఎస్ ప్రసాద్ లేచి తీర్పు కాపీ వచ్చే వరకు దాని అమలును నిలిపేయాలని కోరగా అందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఇదిలా ఉండగా, తీర్పును సవాల్ చేస్తూ సిట్ అప్పీల్ చేస్తుందని ఏజీ చెప్పారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు సోమవారం తీర్పు ప్రకటించింది. క్రిమినల్ కేసులో బాధితులు, నిందితులు, ప్రతివాదులు, దర్యాప్తు అధికారులు మాత్రమే ఏదైనా కేసు వేసేందుకు ఆస్కారముంటుందని తెలిపిన న్యాయస్థానం, బిజెపి ప్రధాన కార్యదర్శి పిటిషన్‌ను తోసిపుచ్చింది.