Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధరణి వెబ్ పోర్టల్‌లో ఉన్న లోపాలతో రాష్ట్రంలో భూ తగాదాలు పెరుగుతున్నాయనీ, దీంతో హత్యలు, ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని టీపీసీసీ కార్యనిర్వాహకఅధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు కైలాష్ నేత, చరణ్ యాదవ్, పవన్ మల్లాదితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే రూ. 40 వేలు విద్యుత్ బిల్లు అవుతుం దన్నారు. అలాంటి ప్రాజెక్టును ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ధరణి, ఇతర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కొంత మంది ప్రభుత్వ అధికారులు కేసీఆర్ తొత్తులుగా పని చేస్తూన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో, లిక్కర్ కుంభకోణంలో కూడా నిస్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ విషయములో అనుమానం ఉందని పేర్కొన్నారు.