Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బహుజన వర్గాల ఆత్మగౌరవ భవనాలకు కోట్లాది రూపాయల విలువైన భూములను కేటాయించడాన్ని విప్లవాత్మకమైన చర్యగా కర్ణాటక రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి శ్రీనివాసాచారి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అసాధారణ నిర్ణయాన్ని ఆచరణలో చూపించారని కొనియాడారు. మంగళవారం ఉప్పల్ భగాయత్ లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ భవనాలు దేశానికే ఒక దిక్సూచిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బీసీ కులాల వారి కోసం సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారనీ, గురుకులాలను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వకర్మ ఆత్మగౌరవ భవన ట్రస్ట్ చైర్మెన్ లాల్ కోట వెంకటాచారి, కార్యదర్శి బొడ్డుపల్లి సురేందర్, ఉపాధ్యక్షులు మదన్ మోహన్, కుందారపు గణేష్, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఎన్.బాలాచారి తదితరులు పాల్గొన్నారు.