Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ గవర్నర్కు బక్క జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలు బ్యాంకుల నుంచి అక్రమంగా రుణాలు తీసుకుంటున్నాయని ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఆర్బీఐ గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సివిల్ సప్లరు కార్పొరేషన్ సెక్యూరిటీ బాండ్ల రూపంలో రూ 45,000 కోట్ల రుణాన్ని తీసుకున్న ప్పటికీ, అది బడ్జెట్ చూపించలేదని గుర్తు చేశారు. ఆర్టీసీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఇలా అనేక సంస్థలు రుణాలు తీసుకున్నాయని తెలిపారు. కాంట్రా క్టర్లకు అనుకూలంగా రుణాలు తీసుకుని రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.